పెద్దాపురం, సామాజిక స్పందన:
మున్సిపల్ వర్కర్ల జీవితాలతో జగన్ ఆటలాడుతున్నాడని, వారిని రోడ్డుపాలు చేసేసారని సిఐటియు జిల్లా ప్రథాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె 3వ రోజు శిభిరాన్ని ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి డబ్బాలు కొట్టిన జగన్ మెాహన్ రెడ్డి నేడు కార్మికులను కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు. నిత్యం ప్రజల కోసమే ఉన్నాను, మాట తప్పను, మడమ తిప్పను అంటూ తిరిగి నేడు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ముఖం చాటేసారన్నారు. ఎండనక, వాననకా, చలిఅనకా పట్టణాలను శుభ్రం చేసే మున్సిపల్ కార్మికుల బతుకులు మట్టి కొట్టుకుపోతుందని అన్నారు. ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్లను స్కిల్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. సమస్య పరిష్కరించకుంటే ఎంతకాలమైనా సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు.
మున్సిపల్ వర్కర్లకు అండగా ఎమ్మెల్యేచినరాజప్ప
మున్సిపల్ వర్కర్లు చేస్తున్న పోరాటానికి తాము ఎప్పుడూ అండగా ఉంటామని పెద్దాపురం శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మాజీ మున్సిపల్ ఛైర్మెన్ రాజా సూరిబాబు రాజు తో కలసి ఆయన సమ్మె శిభిరాన్ని సందర్శించారు. మున్సిపల్ కార్మికుల కోసమే మేము ఉన్నామని చెప్పిన జగన్ మెాహన్ రెడ్డి నేడు వారు ఊసుఎత్తడం లేదన్నారు. ఎంతో మంది కార్మికులు ప్రజల కోసం, పట్టణాల శుభ్రత కోసం చెత్త ఎత్తుతూ పనులు చేస్తున్నారని అన్నారు. కార్మికులను పర్మినెంట్ చేయ్యాలని డిమాండ్ చేసారు. వీరివెంట తెలుగుదేశం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రంది సత్తిబాబు, తూతిక రాజు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లు బేదంపూడి సత్తిబాబు, గెడ్డం పెదకాపు, ఎలిశెట్టి నాని తదితరులు పాల్గోన్నారు.
సమ్మె శిభిరానికి సిఐటియు నాయకులు డి.క్రాంతి కుమార్. మున్సిపల్ వర్కర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శిలు వర్రే గిరిబాబు, శివకోటి అప్పారావు, సింగంపల్లి సింహాచలం, వర్రే రమణ, రాజేష్, సురేష్, శ్రీను, శేఖర్, టి.నాగేశ్వరరావు, పి.అప్పారావు, వెంకట రమణ, బాసిన భధరావు, నాగేశ్వరరావు, భవానీ, ఎస్.మరిడమ్మ తదితరులు పాల్గోన్నారు.
@@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@
సమ్మర్ క్యాంప్ లో మ్యాజిక్ క్లాస్
సామాజిక స్పందన: పెద్దాపురం
పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యాసలపు సూర్యారావు భవన్ లో జరుగుతున్న సమ్మర్ క్యాంప్ 3 వ రోజు జెవివి నాయకులు, ప్రముఖ ఇంద్రజాల ప్రదర్శకులు బుద్దా శ్రీనివాస్ విద్యార్దులకు ఇంద్రజాల ప్రదర్శనకు సంబందించిన చిట్కాలను తెలియజేసారు. ఎల్.కె.జి నుండి 10వ తరగతి వరకూ ఉన్న విద్యార్దులు దాదాపు 130 మంది హాజరయ్యారు. సాయంత్రం 4.30 కి ప్రారంభమయిన సమ్మర్ క్యాంప్ 7 గంటల వరకూ జరిగింది. ప్రారంభంలో లెక్కల ప్రాధమిక సూత్రాలను నీలపాల బాలమురళీకృష్ణ చెప్పగా, చిత్రలేఖనంను దుంగల శ్యామ్ కుమార్ విద్యార్దులతో చేయించారు. సమ్మర్ క్యాంప్ లో కధలు రాసిన విద్యార్దులకు, పెయింటింగ్ బాగా వేసిన విద్యార్దులకు కృష్ణ బేకరి ప్రకాష్, కడిమిశెట్టి వెంకటేష్, బుద్దా శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులు అందజేసారు.
సమ్మర్ క్యాంప్ సమన్వయకర్త కూనిరెడ్డి అరుణ, దారపురెడ్డి కృష్ణ, ఉమామహేశ్వరి, లలిత, నమ్రత లు పాల్గోన్నారు.
@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@@
సిఐటియు ఆధ్వర్యంలో వాడవాడలా మేడే జెండా ఆవిష్కరణలు
సామాజిక స్పందన : పెద్దాపురం మండలం
136వ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురష్కరించుకొని సిఐటియు పెద్దాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో వాడవాడలా ఎర్రజెండాలను ఆవిష్కరించారు. పట్టణంలోనూ, రూరల్ ప్రాంతాలల్లో అనుబంధ సంఘాల నాయకులు జెండా ఆవిష్కరణలు చేసారు. ఈ సందర్భంగా పెద్దాపురం పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన జెండా ఆవిష్కరణను శాంత, ఐసిడిఎస్ కార్యాలయంలో ఇ. ఉమామహేశ్వరి, ఎమ్.ఇ.వో కార్యాలయం వద్ద మిడ్డే మిల్ వర్కర్స్ యూనియన్ నాయకలు కరక సుబ్బలక్ష్మీ, శ్రీ మరిడమ్మ తల్లి పెయింటింగ్ యూనియన్ ఆధ్వర్యంలో వినాయకుని గుడి సెంటర్లో తైనాల శ్రీను, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యలో జరిగిన జెండా ఆవిష్కరణలో పాత పెద్దాపురంలో బుడతా రవీంద్ర, కొత్తపేటలో బైలపూడి నూకరాజు, పాండవగిరి పెయింటింగ్ యూనియన్ ఆధ్వర్యంలో సినిమా సెంటర్లో నీలం శ్రీను, ప్రైవేటు ఎలక్ర్టికల్ యూనియన్ ఆధ్వర్యంలో యాసలపు సూర్యారావు భవనం వద్ద చింతల సత్యనారాయణ, వ్యవసాయ పరిశోదనా ఫారం వద్ద బండారు రామకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద శ్రీను, వాలు తిమ్మాపురం ఇండస్ర్టియల్ ప్రాంతంలో గడిగట్ల సత్తిబాబు జెండా ఆవిష్కరణలు చేసారు. ఈ సదర్భంగా సిఐటియు నాయకలు డి.క్రాంతి కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతి కార్మికుడు చేసుకునే పండుగ మేడే అని అన్నారు. ఆకలి అజీర్తి లేని సమాజం నిర్మించడమే లక్ష్యంగా, 8గంటల పని దినం కోసం జరిగిన పోరాటాన్ని మనం ఎల్లప్పుడు గుర్తు చేసుకోవాలన్నారు. కార్పోరేటకరణకు, మతతత్వానికి వ్యతిరేకంగా ఈ మేడే నిర్వహిస్తున్నామన్నారు. నాటి పోరాట స్పూర్తి నేటికి కొనసాగిస్తామని శబద్దం చేసారు.
రూరల్ ప్రాతంలో
మేడే సందర్భంగా మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. చిన బ్రహ్మదేవంలో కంచుమర్తి కాటంరాజు, ఆనూరులో మేడిశెట్టి గంగాధర్, కొండపల్లిలో కొండపల్లి సర్పంచ్, ఆర్.బి.కొత్తూరు, ఆర్.బి. పట్నంలో అంగన్వాడీ వర్కర్ యూనియన్ నాయకులరాళ్ళు వరలక్ష్మీ, సావిత్రి, కట్టమూరులో లోవతల్లి, కాండ్రకోటలో వామిశెట్టి స్వామి, పులిమేరులో దాడి బేబి, చంద్రమాంపల్లిలో నూకల మంతి రాంబాబు, తాటిపర్తిలో మాగాపు నాగు, తిరుపతిలో మైబగంగ బాబు, చెదలాడ, గుడివాడ, సిరివాడ, వివిధ గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు లు చేసారు. కార్మికులు పెద్ద ఎత్తున్న పాల్గోన్నారు.
సిపిఎం ఆధ్వర్యంలో 6 చోట్ల జెండా ఆవిష్కరణ చెయ్యడం జరిగింది. సుందరయ్య కాలనీ, ప్లీడర్్స్ కాలనీ, సూర్యారావు భవన్ తన భవిన్, వేముల వారి సెంటర్, సినిమా సెంటర్లలో జెండా ఆవిష్కణలు చేసారు.


















0 Comments